
భూ సమస్యల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ కమిటీ ఇవాళ సెక్రటేరియట్ లో సమావేశం అయ్యింది. సర్వే ఆండ్ సెటిల్‌మెంట్ శాఖ, వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మూడు శాఖలకు సంబంధించి అంశాలపై కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, భూమి సునీల్ కుమార్, మధు సూదన్, సీఎమ్మాఆర్ఓ వి.లచ్చిరెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కమిటీ చర్చించిన అంశాలు విభాగాల వారీగా..
సర్వే ఆండ్ సెటిల్‌మెంట్ శాఖకు సంబంధించినవి..
- ప్రస్తుతం సర్వే ఆండ్ సెటిల్‌మెంట్ శాఖ నిర్వహిస్తున్న సర్వే రికార్డుల జాబితా
- రాష్ట్రంలో ఖాస్రా పహాణి, సెసలా పహాణి రికార్డుల నిర్వహణ ఇవి ధరణి పోర్టల్ అప్‌లోడ్ చేశారా ?
- భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వే మ్యాప్‌ల ప్రస్తుత పరిస్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, ఈ మ్యాప్‌లకు మధ్య వ్యత్యాసం ఉందా ?
- మూడు పైగాలకు సంబంధించి డాక్యుమెంట్‌ల ప్రస్తుత స్థితి.
- రైతులు సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
వక్ఫ్ బోర్డుకు సంబంధించి..
- వక్ఫ్ బోర్డు కింద ఉన్న మొత్తం భూ విస్తీర్ణం ఎంత ?
- కబ్జాలకు గురైన భూమి విస్తీర్ణం ఎంత ?
- వక్ఫ్ భూములకు సంబంధించి నోటిఫికేషన్‌ల ప్రక్రియ
- వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ఎలా రక్షిస్తున్నాయి.
- వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఉన్న భూముల విస్తీర్ణం
- ధరణి పోర్టల్ లో వక్ఫ్ భూములకు సంబంధించి ఉన్న సమస్యలు
దేవాదాయ శాఖకు సంబంధించి..
- దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం భూ విస్తీర్ణం ఎంత.
- దేవాదాయ భూముల రక్షణకు దేవాదాయ శాఖ తీసుకుంటున్న చర్యలుఏమిటి?
- దేవాదాయ భూముల రక్షణకు రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలు
- ధరణి పోర్టల్‌లో దేవాదాయ భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలు.