
కంది, వెలుగు: మహిళా పీజీ స్టూడెంట్స్ను వేధిస్తున్న ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఏడీను సస్పెండ్చేయాలంటూ స్టూడెంట్లు ధర్నాకు దిగారు. సంగారెడ్డి మండలంలోని కాలేజీ గేట్ముందు బుధవారం పీజీ స్టూడెంట్స్బైఠాయించి మేనేజ్మెంట్, అసిస్టెండ్డైరెక్టర్(ఏడీ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతకాలంగా ఏడీ చెకింగ్పేరిట రాత్రి పూట హాస్పిటల్లోని మహిళా పీజీ స్టూడెంట్ల రూంలలో, వాష్ రూంలలో, బెడ్ల కింద చెక్చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుసార్లు కాలేజీ వీసీ, ప్రిన్సిపల్ తదితరులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
మంగళవారం రాత్రి కూడా రూంలలోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించాడన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్స్పందించి ఏడీని సస్పెండ్చేయాలని డిమాండ్చేశారు. కాలేజీ డాక్టర్లు వచ్చి మరోసారి ఏడీ హాస్పిటల్వైపు రాకుండా చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పిస్తామని అన్నారు. ధర్నా విరమించి డ్యూటీలో చేరాలని కోరారు. ఏడీని సస్పెండ్ చేసేవరకు దశలవారీగా ధర్నా కొనసాగిస్తామని స్టూడెంట్స్ తేల్చి చెప్పారు.