బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌–క్రాస్టో జోడీ బోణీ

బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌–క్రాస్టో జోడీ బోణీ

నింగ్బో (చైనా): ఇండియా షట్లర్లు ధ్రువ్‌‌‌‌ కపిల–తనీషా క్రాస్టో జోడీ బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బోణీ చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌–క్రాస్టో 14–21, 21–11, 15–21తో ఫువానత్ హోర్‌‌‌‌బాన్‌‌‌‌లుకిత్–బెన్యాపా ఐమ్సార్డ్ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌)పై గెలిచారు. మరో మ్యాచ్‌‌‌‌లో రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌– గద్దె రుత్విక శివాని 13–21, 19–21తో ఎనిమిదో సీడ్‌‌‌‌ గోహ్‌‌‌‌ సూన్‌‌‌‌ హుయట్‌‌‌‌–లాయ్‌‌‌‌ శివోన్‌‌‌‌ జెమీ (మలేసియా) చేతిలో ఓడారు. అషిత్‌‌‌‌ సూర్య–అమృత ప్రథమేశ్‌‌‌‌ 16–21, 15–21తో వాంగ్‌‌‌‌ టియాన్‌‌‌‌ సి–లిమ్‌‌‌‌ చియు సివాన్‌‌‌‌ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు.