అన్న సమాధి దగ్గరే ధృవ సార్జా.. కూతురితో ఆడుకుంటూ ఎమోషనల్ వీడియో

అన్న సమాధి దగ్గరే ధృవ సార్జా.. కూతురితో ఆడుకుంటూ ఎమోషనల్ వీడియో

కన్నడ హీరో ధ్రువ సర్జా(Druv sarja) తన అన్న చనిపోయిన బాధ నుండి బయటకు రావడంలేదు. తన అన్నాను తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు.  ధ్రువ సార్జా అన్న హీరో చిరంజీవి సర్జా(Chiranjeevi sarja) 2020 జూన్‌ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తన కుటుంబాన్ని తీవ్ర దుక్క సంద్రంలోకి నెట్టేసింది.  

అయితే.. చిరంజీవి సార్జా చనిపోయి మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ బాధ నుండి బయటకురాలేకపోతున్నాడు ధ్రువ. అన్న సమాధి దగ్గరే ఉంటూ భాదపడుతున్నారు. ఇటీవల ధ్రువ తన అన్న సమాధి దగ్గర నిద్రించగా.. అది చూసిన ఆయన అభిమాని దాన్ని వీడియో తీశాడు. ఎంతో ఎమోషనల్ గా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అయ్యింది. 

ఇక తాజాగా మరో ఆసక్తికర వీడియో షేర్‌ చేశాడు హీరో ధ్రువ. ఏ వీడియోలో తన కూతురితో కలిసి అన్న సమాధిపై ఆడుకుంటూ కనిపించాడు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అది చుసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు.