నీట్ పేపర్ లీక్ కేసులో M సార్ అరెస్ట్.. పరీక్షకు 10 రోజుల ముందే వాట్సప్‎లో క్వశ్చన్ పేపర్..?

నీట్ పేపర్ లీక్ కేసులో M సార్ అరెస్ట్.. పరీక్షకు 10 రోజుల ముందే వాట్సప్‎లో క్వశ్చన్ పేపర్..?

ముంబై: నీట్ యూజీ 2026 క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో M సార్‎గా గుర్తింపు పొందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ ఆర్‏సీసీ అధినేత శివరాజ్ రఘునాథ్ మోటెగాంకర్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మోటెగాంకర్ పరీక్షకు 10 రోజుల ముందే నీట్ (NEET-UG 2026) ప్రశ్నపత్రాన్ని సంపాదించి.. దానిని తన మొబైల్ ఫోన్ ద్వారా లీక్ చేశారని సీబీఐ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే విచారణ నిమిత్తం సోమవారం (మే 18) అతడిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అలాగే, ఆర్‎సీసీ కోచింగ్ సెంటర్లలో సోదాలు జరిపి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, ఇతర డిజిటల్, ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే పేపర్ లీక్ మాస్టర్ మైండ్స్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి, బయాలజీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్‎ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఎవరీ M సార్..?

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన శివరాజ్ రఘునాథ్ మోటెగాంకర్ ప్రముఖ కెమిస్ట్రీ ప్రొఫెసర్. లాతూర్ కేంద్రంగా ఆయన రేణుకాయ్ కెరీర్ సెంటర్ (RCC - Renukai Chemistry Classes) నిర్వహిస్తున్నారు. RCCని అనతికాలంలోనే మహారాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన కోచింగ్ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఆర్‎సీసీ నెట్‌వర్క్ అనేక జిల్లాల్లో విస్తరించి ఉంది.

►ALSO READ | రెండు ఏనుగుల గొడవ.. అన్ని సార్లు ఏనుగు మీద పడే సరికి.. పాపం ఆమె ప్రాణం పోయింది !

 ఆర్‎సీసీ‎లో ఏటా దాదాపు 40 వేల మంది విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల కోసం శిక్షణ పొందుతారు. మహారాష్ట్ర కోచింగ్ సెంటర్ వర్గాల్లో శివరాజ్ రఘునాథ్ మోటెగాంకర్ M సార్‎గా ఫేమస్. విద్యార్థులు, కోచింగ్ వర్గాల్లో ఆయనను ఎం సార్ అని పిలుస్తుంటారు. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రశ్నపత్రాల రూపకల్పన చేసే వ్యక్తులతో M సార్ కు దగ్గరి పరిచయాలు ఉన్నాయి.

 వీరి ద్వారానే ఆయన నీట్ యూజీ 2026 పేపర్ సంపాదించి దానిని వాట్సప్ ద్వారా ఇతరలకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే సీబీఐ బృందాలు ఇప్పటికే లాతూర్, పూణేలలో మోటెగావ్‌కర్‌ను పలుమార్లు ప్రశ్నించడంతో ఆయన ఇళ్లు, కార్యాలయం, కోచింగ్ సెంటర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు.