నా కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు : చంద్రబాబు

నా కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు : చంద్రబాబు

ఏపీ రాజదానిని ఏడు నెలలుగా ప్రభుత్వం గందరగోళం చేసిందని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.  లాండ్ పూలింగ్ అన్నది విన్నూత్న ప్రయత్నమని.. భూములు ఇచ్చిన వారిలో ఎకరా లోపు ఉన్నవారు 5200 మంది ఉన్నారని చెప్పారు. పది ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు ఇచ్చినవారు 600 మంది, మొత్తం 21 వేల మంది రైతులు స్వచ్చందంగా ఇచ్చారని తెలిపారు. అదనంగా యాడ్ అయిన భూమి మరో ఇరవై ఎకరాలు అని అన్నారు. తన కాన్సెప్ట్ అర్దం చేసుకుంటే మంత్రి పేర్ని నాని దీనిపై మాట్లాడేవారు కాదని చంద్రబాబు అన్నారు.

పూలింగ్ లో బూములు ఇచ్చినవారికి కమర్షియల్, రెసిడెన్షియల్ లాండ్ ఇచ్చామని తెలిపారు.  రైతులకు కౌలు కూడా ఇచ్చామని ఆయన అన్నారు. ఇక్కడ హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని, వాటిని వాడుకోవచ్చు కదా..కొత్తచోట కడితే మళ్లీ ఖర్చు చేయాలి కదా అని చంద్రబాబు అన్నారు. అన్ని అవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. ఈ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించేవాళ్లమన్నారు. భూమి అమ్మిన డబ్బులనే అమరావతికి ఖర్చు చేసినట్లు చెప్పారు చంద్రబాబు.