సీఎం హిమాంత ఓ ట్యూబ్ లైట్.. అతడిది పాకిస్థాన్ మైండ్ సెట్: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

సీఎం హిమాంత ఓ ట్యూబ్ లైట్.. అతడిది పాకిస్థాన్ మైండ్ సెట్: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అస్సాం సీఎం హిమాంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. తాజాగా సీఎం హిమాంత బిస్వా శర్మపై అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (జనవరి 11) నాగ్‌పూర్‌లో ఓవైసీ విలేకరులతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఓ ట్యూబ్ లైట్ అని అభివర్ణించారు. ఆయనది పాకిస్తాన్ లాంటి మనస్తత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ రాజ్యాంగంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే దేశ ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు కాగలరు. కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలోని ఏ పౌరుడైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మేయర్ అయ్యే హక్కు కల్పించింది. దేవుడిని నమ్మని వారికి కూడా ఇక్కడ స్థానం ఉందని అన్నారు. శర్మ వంటి వ్యక్తులు రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కానీ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. భారతదేశం ఏ ఒక్క మతానికి లేదా సమాజానికి చెందినది కాదని, అదే దేశ సౌందర్యమని హిమాంత బిస్వా శర్మకు కౌంటర్ ఇచ్చారు. 

అసలు వివాదమేంటంటే..? 

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే రోజు వస్తుందని.. అది తన కల అని అన్నారు. భారత రాజ్యాంగం ఏ పౌరుడైనా అత్యున్నత పదవిని చేపట్టే హక్కు కల్పించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే హిమాంత బిస్వా శర్మ, ఓవైసీ మధ్య డైలాగ్ వార్‎కు కారణమయ్యాయి. ఓవైసీ వ్యాఖ్యలకు శర్మ కౌంటర్‎ ఇచ్చారు.  

►ALSO READ | ఇండియాకు సేవచేద్దామని యూఎస్ నుంచి వస్తే .. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రాజ్యాంగపరంగా ప్రధానమంత్రి కావడానికి ఎవరికీ అడ్డంకులు లేనప్పటికీ..  భారత్ హిందూ నాగరికత కలిగిన దేశమని.. భారత ప్రధానమంత్రి ఎల్లప్పుడూ హిందువుగా ఉంటారని పేర్కొన్నారు. దీంతో హిమాంత వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. హిమాంత బిస్వా శర్మది పాకిస్థాన్ లాంటి మనస్తత్వమని విమర్శించారు. శర్మ వంటి వ్యక్తులు రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కానీ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. భారతదేశం ఏ ఒక్క మతానికి లేదా సమాజానికి చెందినది కాదని, అదే దేశ సౌందర్యమని హిమాంత బిస్వా శర్మకు కౌంటర్ ఇచ్చారు.