జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విషాద ఘటన

జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విషాద ఘటన

జూబ్లీహిల్స్ , వెలుగు: జిమ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్ చౌదరి (51) గుట్టల బేగంపేటలోని సైబర్ హిల్స్ కాలనీలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్​నంబర్ 36​లోని ఈఎస్‌వైబీఓ జిమ్​కు వెళ్లాడు. 

గంట పాటు వ్యాయామం పూర్తి చేసిన అనంతరం బాత్రూమ్​లోకి వెళ్లిన అనిల్ చౌదరి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన జిమ్ నిర్వాహకులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనిల్ చౌదరి గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు.