న్యూఢిల్లీ: ఇండియా ఆటో ఇండస్ట్రీ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తెచ్చిన బీఎస్–6 నియమాలను పాటించాలంటే కచ్చితంగా వాడాల్సిన డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) ప్రస్తుతం దొరకడం లేదు. యుద్ధం వలన దీని తయారిలో వాడే కీలకమైన రా మెటీరియల్ టెక్నికల్ గ్రేడ్ యూరియా (టీజీయూ) కొరత ఏర్పడింది. బీఎస్–6 రూల్స్ ప్రకారం, 2020 ఏప్రిల్ తర్వాత తయారైన పెద్ద డీజిల్ వాహనాలకు సెలెక్టివ్ కెటలిస్ట్ రిడక్షన్ (ఎస్సీఆర్) సిస్టమ్ తప్పనిసరి. ఎస్సీఆర్ సిస్టమ్ పనిచేయాలంటే డీఈఎఫ్ (32.5 శాతం టీజీయూ+ వాటర్) అవసరం. ఈ ఎస్సీఆర్ సిస్టమ్ బండ్ల నుంచి వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. డీఈఎఫ్ లేకుండా బీఎస్–6 డీజిల్ వాహనాలు నడవవు. ఇంజిన్ ఇంటర్లాక్ అయి బండి ఆగిపోతుంది.
