గద్దర్ అవార్డును స్వీకరించండి..చిరంజీవికి దిల్ రాజు ఆహ్వానం

గద్దర్ అవార్డును స్వీకరించండి..చిరంజీవికి దిల్ రాజు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును స్వీకరించాలని ప్రముఖ హీరో చిరంజీవిని ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎండీ ప్రియాంక కోరారు. ఈ మేరకు గురువారం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి ఇన్విటేషన్​ను అందజేశారు.

ఈనెల 19న హైటెక్స్ లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.