దినేష్ కార్తీక్ ఎమోషనల్ ట్వీట్

దినేష్ కార్తీక్ ఎమోషనల్ ట్వీట్

టీమిండియా వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ కల నెరవేరింది. ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ ప్రకటించిన 15 మందితో కూడిన జట్టుకు దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. దీంతో దినేష్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. 

కల నెరవేరింది..
15 ఏళ్ల తర్వాత దినేష్ కార్తీక్ టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు. 2007లో సౌతాఫ్రికాలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ లో ఆడిన కార్తీక్..మళ్లీ ఇన్నేళ్లకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కడంపై దినేష్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. కల నెరవేరిందని ఎమోషనల్గా ట్వీట్ చేశాడు. ట్వీట్కు లవ్ ఎమోజీని జతచేశాడు. 

టీ20 వరల్డ్‌కప్‌ టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్. స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్