శంకర వరప్రసాద్‌ ను ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు

శంకర వరప్రసాద్‌ ను ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన  చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజే రూ.84 కోట్లు వసూళ్లు చేసిందని మేకర్స్ చెప్పారు.  ఈ సందర్భంగా  మంగళవారం నిర్వహించిన  బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్‌లో  దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతిని కూడా నాకు మొమరబుల్‌గా చేసిన ప్రేక్షకులందరికీ స్పెషల్ థ్యాంక్స్. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి అందరి కృతజ్ఞతలు తీర్చుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నటనలో ఉన్న నవరసాలను పండించిన చిరంజీవి గారిని మళ్లీ అలా చూపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం తీశాం. 

ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు’ అని చెప్పాడు.   నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘ఈ మూవీకి  ఎంకరేజింగ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పాజిటివ్ టాక్‌తోపాటు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నాన్నగారి పేరు నిలబెట్టుకున్నాను అని అనుకుంటున్నా. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు’ అని అన్నారు.  సాహు గారపాటి మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో సినిమా చేయాలనే డ్రీమ్‌ను అనిల్ నెరవేర్చాడు. 

ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ పేరు బాస్ ఆఫీస్‌గా మారుద్దని మూడు నెలల క్రితమే అనిల్‌తో అన్నాను.  చిన్న వాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో  సంక్రాంతిని మరింత  గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు’ అని అన్నారు.  నటులు శ్రీనివాస్ రెడ్డి, అభినవ్ గోమటం, హర్ష వర్ధన్,  ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, డీవోపీ సమీర్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు,  మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, లిరిసిస్టులు రామ జోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు.