సాక్సుల‌తోనే మాస్కులు: ర‌విబాబు సూప‌ర్ ఐడియా

సాక్సుల‌తోనే మాస్కులు: ర‌విబాబు సూప‌ర్ ఐడియా

బ‌య‌టికి వెళ్తే మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. కరోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్ర‌భుత్వాలు ఈ నిర్ణ‌యం తీసుకోగా.. ప్ర‌స్తుతం మార్కెట్లో మాస్కుల కొర‌త బాగా ఉంది. ఇప్ప‌టికే ప‌లు మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో మాస్కులను త‌యారు చేయిస్తున్నారు అధికారులు. కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులైతే టైల‌రింగ్ వారితో మాస్కులు కుట్టించి పంపిణీ చేస్తున్నారు.

అయితే అంద‌రికీ మాస్కులు త‌ప్ప‌రిస‌రి కావ‌డంతో ర‌క‌ర‌కాల ఐడియాల‌తో వీటిని త‌యారు చేసుకుని ధ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌టుడు, డైరెక్ట‌ర్ ర‌విబాబు మాస్కులను ఎలా త‌యారు చేయాలో చెప్పిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. స్టిచ్చింగ్ అవ‌స‌రం లేకుండా సాక్సుల‌తోనే ఎంచ‌క్కా మాస్కులు చేసుకోవ‌చ్చి వీడియో రూపంలో చేసి చూపించాడు.

సాక్సుల‌తో మాస్కులు.. ఈ కింది వీడియోలో చూడండి