దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యకు 13 ఏండ్లే

దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యకు 13 ఏండ్లే

దిశ ఘటన నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్యను మైనర్ గా తేల్చారు అధికారులు. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం జరిపిన విచారణలో ఆమెను మైనర్ గా గుర్తించారు. స్కూల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా… బాలిక వయసును 13ఏళ్లుగా నిర్థారించారు అధికారులు. 15-06-2006 లో పుట్టిన బాలికకు మైనార్టీ తీరకుండానే పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య.. తన బాబాయి దగ్గర ఉంటోంది. అయితే ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐతే తాను తన అత్తమామ దగ్గరే ఉంటానని చెప్పింది చెన్నకేశవులు భార్య.