V6 News

జిల్లా కోర్టులో ఆరోగ్య కేంద్రం ప్రారంభం

జిల్లా కోర్టులో ఆరోగ్య కేంద్రం ప్రారంభం

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టు సముదాయంలో వైద్య సేవలను విస్తరించేందుకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్వంలో ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ డిస్పెన్సరీ ద్వారా కోర్టు సిబ్బందికే కాకుండా కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులకు సైతం ఉచితంగా వైద్య సేవలు అందనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్, జూనియర్ సివిల్ జడ్జీలు భవిష్య, నికిత, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నర్సయ్య, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరన్, జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ఎస్పీ శ్రీనివాస్, సీనియర్ సూపరింటెండెంట్ రాజారాం పాల్గొన్నారు.