షాపు లైసెన్సులు కనిపించేట్టు పెట్టాలి : మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి 

షాపు లైసెన్సులు కనిపించేట్టు పెట్టాలి : మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: షాపుల నిర్వాహకులు తమ ట్రేడ్ లైసెన్స్​ను కనిపించేట్టు పెట్టుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సూచించారు. గురువారం కుషాయిగూడ, వైష్ణవి ఎన్​క్లేవ్, సాధన విహార్, భవానీ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కుషాయిగూడ రోడ్ నంబర్ –5లో కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు.

రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. వైష్ణవి ఎన్​క్లేవ్​లో నిర్మాణంలో ఉన్న థీమ్ పార్క్ పనులను ఆయన సమీక్షించారు. మే 15 నాటికి ప్లే ఏరియా, యాంఫీ థియేటర్(బహిరంగ వేదిక), క్యాంటీన్ తో పాటు పచ్చదనం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.