పంపకాల్లో గొడవ.. బయటపడ్డ నకిలీ నోట్లు

పంపకాల్లో గొడవ.. బయటపడ్డ నకిలీ నోట్లు

మెహిదీపట్నం, వెలుగు: ముగ్గురి మధ్య పంపకాల్లో గొడవ రావడంతో ఫేక్​ కరెన్సీ విషయం బయట పడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబూలాల్(23) ప్రైవేట్ ఉద్యోగి, ధర్మవీర్ (22) విద్యార్థి. వీరిద్దరు కలిసి రూ.43 లక్షల 50 వేల విలువైన నకిలీ 500 నోట్ల కరెన్సీని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. టోలిచౌకి పారమౌంట్ కాలనీలో ఉంటున్న నైజీరియన్ ప్రాంతానికి చెందిన అవేస్ హెర్షి సలాడ్(30)కు డబ్బులు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు.

శనివారం సాయంత్రం నానల్ నగర్ అవలాన్ అపార్ట్మెంట్ లో అతడికి ఫేక్​ కరెన్సీ ఇస్తున్న తరుణంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చ చూసిన స్థానికులు గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నకిలీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. నకిలీ కరెన్సీ నోట్లతో పాటు నాలుగు సెల్ ఫోన్లు, బైక్​ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బైరి రాజు తెలిపారు. నకిలీ కరెన్సీ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.