పిల్లల అభివృద్ధికి.. చేతులు కలిపిన ఐఐపీహెచ్‌‌, వర్ణం

పిల్లల అభివృద్ధికి.. చేతులు కలిపిన ఐఐపీహెచ్‌‌, వర్ణం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మెంటల్ ప్రాబ్లమ్స్‌‌‌‌తో బాధపడుతున్న పిల్లలకు సాయం చేసేందుకు   ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ – హైదరాబాద్‌‌‌‌ (ఐఐపీహెచ్‌‌‌‌)తో  దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్  చేతులు కలిపింది. ఆటిజం, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకు సాయం చేస్తున్న ఈ సంస్థ, తన  వర్ణం చైల్డ్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్ ద్వారా  పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వారి అభివృద్ధి సాయం చేయడానికి కృషి చేస్తోంది. 

ఈ భాగస్వామ్యానికి  సంబంధించి  దివీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు  ప్రమోద్ గడ్డం, ఐఐపీహెచ్‌‌‌‌ ప్రతినిధి  రాజన్ శుక్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ రెండు సంస్థలు  ఎదుగుదల ఆలస్యమైనా,  న్యూరోడెవలప్‌‌‌‌మెంటల్ డిజార్డర్స్ (ఎన్‌‌‌‌డీడీల) తో  బాధపడుతున్న పిల్లలను  గుర్తించి, వారికి సాయం చేస్తాయి.   ఈ భాగస్వామ్యంలో భాగంగా తెలంగాణలోని డిస్ట్రిక్ట్‌‌‌‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌‌‌‌ సెంటర్ (డీఈఐసీ)టీమ్‌‌‌‌ల స్కిల్స్  పెంచేందుకు యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్‌‌‌‌తో కలిసి పనిచేస్తాయి.  

అక్టోబర్ 29, 30 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌లోని వర్ణం చైల్డ్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌లో వర్క్‌‌‌‌షాప్ కూడా నిర్వహించారు.  కోఠగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల డీఈఐసీ ప్రొఫెషనల్స్ స్కిల్స్‌‌‌‌ను పెంచడంపై ఇందులో ఫోకస్ పెట్టారు.  ఐఐహెచ్‌‌‌‌పీ,  వర్ణం కలిసి నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లలో కేర్ పాత్‌‌‌‌వే మ్యాపింగ్, అభివృద్ధి స్క్రీనింగ్ టూల్స్, సిమ్యులేషన్ ఆధారిత కేస్ స్టడీస్‌‌‌‌ ఉన్నాయి.