Virat Kohli: ఇలాంటివి కోహ్లీకే సాధ్యం.. విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించిన టెన్నిస్ ఆల్‌టైం గ్రేటెస్ట్

Virat Kohli: ఇలాంటివి కోహ్లీకే సాధ్యం.. విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించిన టెన్నిస్ ఆల్‌టైం గ్రేటెస్ట్

టెన్నిస్ ప్లేయర్లకు క్రికెట్ అంటే ఏంటో తెలియదు. అసలు క్రికెట్ ప్లేయర్లు గురించి వారు పెద్దగా పట్టించుకోరు. అయితే కోహ్లీ కారణంగా క్రికెట్ లో క్రేజ్ అమాంతం పెరిగింది. కోహ్లీ కి ఉన్న నెక్స్ట్ లెవల్ ఫాలోయింగ్ కారణంగా క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడం విశేషం. ఇదంతా పక్కన పెడితే కోహ్లీ రిటైర్మెంట్ వార్త టెన్నిస్ ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ దగ్గరకు చేరింది. టెన్నిస్ లెజెండ్ జొకోవిచ్ కోహ్లీకి రిటైర్మెంట్ పై స్పందించడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో "ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్" అని కోహ్లీని ప్రశంసించాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే పోస్ట్ చేసిన జొకోవిచ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ టెన్నిస్ మరియు క్రికెట్ వర్గాలలో వైరల్‌గా మారింది. కోహ్లి, జోకొవిచ్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరూ కలవకపోయినా 2024 జనవరిలో వీడియో ద్వారా వీరు గతంలో మాట్లాడుకున్నారు. కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ చేసినప్పుడు కూడా అతడు తన ఇన్‌స్టా స్టోరీలో జొకోవిచ్ అభినందనలు తెలిపాడు. జొకోవిచ్ టెన్నిస్ లో 24 గ్రాండ్ స్లామ్స్ టైటిల్ గెలిచి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 

టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ సోమవారం (మే 12) రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో మొదలైన కోహ్లీ ప్రయాణం 2025లో ముగిసింది. ఇకపై కింగ్ టెస్టుల్లో కనిపించడనే ఊహ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ టెస్ట్ కెరీర్ ను ఒక్కసారి చూసుకుంటే.. 123 టెస్ట్ మ్యాచుల్లో 210 ఇన్నింగ్స్ ఆడాడు. 9230 పరుగులు చేశాడు. 31 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలతో కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చింది.