డీఎల్‌‌, జేఎల్ నోటిఫికేషన్ రిలీజ్​..మే 7 వరకు అప్లికేషన్లకు గడువు

డీఎల్‌‌, జేఎల్ నోటిఫికేషన్ రిలీజ్​..మే 7 వరకు అప్లికేషన్లకు గడువు
  • డీఎల్‌‌, జేఎల్ నోటిఫికేషన్ రిలీజ్​
  • మే 7 వరకు దరఖాస్తులకు గడువు
  • అన్ని పోస్టులకూ పేపర్‌‌‌‌-1 కామన్‌‌
  • ఇంగ్లిష్‌‌, తెలుగులో క్వశ్చన్ పేపర్స్​
  • మే 7 వరకు అప్లికేషన్లకు గడువు

హైదరాబాద్, వెలుగు: గురుకుల డిగ్రీ, జూనియర్‌‌‌‌ కాలేజీల్లో లెక్చరర్, ఇతర పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి మే 17 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. బోర్డు వెబ్‌‌సైట్‌‌లో (www.treirb.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తామని, ఎగ్జామ్ కు వారం ముందు హాల్‌‌ టికెట్లను వెబ్‌‌సైట్ నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని పేర్కొంది. 

డిగ్రీ గురుకులాల్లో అన్ని పోస్టులకూ పేపర్‌‌‌‌ వన్ కామన్‌‌గా ఉంటుందని, ఇంగ్లిష్‌‌, తెలుగులో క్వశ్చన్ పేపర్ ఇస్తామని తెలిపింది. లాంగ్వేజ్ పేపర్లు మినహా మిగిలిన సబ్జెక్టులకు పేపర్ 2 ఇంగ్లిష్‌‌లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు పేపర్ వన్ కూడా ఇంగ్లిష్‌‌లో మాత్రమే ఉండగా, ఈ సారి తెలుగులో కూడా ఇస్తుండడం గమనార్హం. పేపర్‌‌‌‌ 1, పేపర్‌‌‌‌ 2 ఎగ్జామ్స్‌‌ ఓఎంఆర్‌‌‌‌ పద్ధతిలోనే జరుగుతాయని, ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఉంటాయని స్పష్టం చేసింది. 

ఆన్‌‌లైన్‌‌లో ఎగ్జామ్‌‌!

జూనియర్ కాలేజీ పోస్టులకు కూడా పేపర్ వన్ కామన్‌‌గా ఉంటుందని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. ఇంగ్లిష్‌‌, తెలుగు భాషల్లో ప్రశ్నపత్రం ఇస్తామని తెలిపింది. పేపర్‌‌–‌‌2, పేపర్‌‌–‌‌3 పరీక్షలు ఇంగ్లిష్‌‌లోఉంటాయని, 3 పేపర్లలోనూ ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే ఇస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ ఓఎంఆర్ విధానంలో ఉంటుందా, ఆన్‌‌లైన్‌‌ విధానం (కంప్యూటర్ బేస్‌‌డ్‌‌ టెస్ట్‌‌)లో ఉంటుందా అనేది బోర్డు స్పష్టం చేయలేదు.