డీమార్ట్​కు రూ.322 కోట్ల లాభం

డీమార్ట్​కు రూ.322 కోట్ల లాభం

ముంబై: డీమార్ట్ సూపర్‌‌‌‌మార్కెట్ చెయిన్‌‌ అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 48 శాతం మేర పెంచేసుకుంది. శనివారం విడుదల చేసిన 2019 సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభం 47.54 శాతం పెరిగి రూ.322.66 కోట్లుగా రికార్డైంది. కంపెనీ రూ.343 కోట్లు లాభం ఆర్జిస్తుందని అనలిస్ట్‌‌లు అంచనావేశారు. వీరి అంచనాలు కాస్త తప్పినప్పటికీ, లాభాలు పెంచుకోవడంలో బాగా ముందుంది. గతేడాది ఇదే క్వార్టర్లో అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌రూ.218.69 కోట్ల నికర లాభాన్ని పోస్ట్ చేసింది.

‘మేము అంచనావేసిన దానికంటే కాస్త తక్కువగా ఈ క్వార్టర్‌‌‌‌లో రెవెన్యూ గ్రోత్ ఉంది. గ్రాస్ మార్జిన్‌‌లో గతేడాదితో పోలిస్తే మంచి ఇంప్రూవ్‌‌మెంట్ నమోదైంది. పన్నుల తర్వాత లాభం కూడా రెవెన్యూ గ్రోత్‌‌లో కనిపించిన పెరుగుదలనే నమోదు చేసింది. కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను సమీక్షించడం స్వాగతించదగ్గ విషయం’ అని అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ ఎండీ, సీఈవో నెవిల్లే నోరోన్హా చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్లో అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ కొత్తగా 5 స్టోర్లను యాడ్ చేసుకుంది.  కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 22.26 శాతం పెరిగి రూ.5,998.90 కోట్లకు చేరుకుంది. గతేడాది ఈ ఆదాయం రూ.4,906.54 కోట్లుగా ఉంది. ఒక్కో షేరుపై ఆర్జించిన ఆదాయం రూ.3.62 నుంచి రూ.5.34కు పెరిగింది. శుక్రవారం షేరు ధర 1.23 శాతం పెరిగి రూ.1,843.25గా రికార్డయింది.