ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి : డీఎంహెచ్ వో రామారావు

ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి :  డీఎంహెచ్ వో రామారావు

కామేపల్లి, వెలుగు : గ్రామాల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని డీఎంహెచ్ వో డాక్టర్ రామారావు ఆదేశించారు. బుధవారం కామేపల్లి పీహెచ్​సీని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని విభాగాలతోపాటు ఇన్ పేషెంట్ వార్డు, ల్యాబ్, స్టోర్ రూమ్ ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ పీహెచ్​సీలో రోగులకు ఇబ్బందులు కలగకుండా తగిన వైద్యం అందించాలన్నారు.

వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్ తనుషా, హెచ్ఈవో వెంకటేశ్వర్లు, సూపర్​వైజర్ రాధాకృష్ణ, స్టాఫ్ నర్స్ పుష్పలత, సిబ్బంది ఉన్నారు.