సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను నమ్మొద్దు

సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను నమ్మొద్దు

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉందని…రాష్ట్రంలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దన్నారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. గ్రామాల్లో ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు మంత్రి.

కరోనా కారణంగా నిలిచిన గొర్రెల పంపిణీ.. ఈనెల 16 నుంచి మళ్లీ ప్రారంభిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నల్గొండ నుంచి గొర్రెల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని.. ఏడు నియోజకవర్గాల్లో 5 వేల గొర్రెల పంచుతామన్నారు. మిగతా జిల్లాల్లోనూ అదే రోజు గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ గొర్రెల యూనిట్లు ఇస్తామన్నారు తలసాని శ్రీనివాస్ . మొదటి విడతలో 7లక్షల 61వేల గొర్రెలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.