ఈ పెన్ను ధర ఎంతో తెలుసా.. ఎందుకింత స్పెషల్?

ఈ పెన్ను ధర ఎంతో తెలుసా.. ఎందుకింత స్పెషల్?

మాములుగా పెన్ను అంటే ఎంత ధర ఉంటుంది?  మంచి ఇంపోర్టెడ్ బ్రాండ్ పెన్నులు మహా అయితే రూ.500 ఉంటాయేమో. కానీ ఈ పెన్ను ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1.90 లక్షలు! మేగ్నాకార్ట్ అనే సంస్థ తయారుచేసిన ఈ పెన్ను, చెన్నై పెన్ షోలో అందర్నీ ఆకట్టుకుంటోంది.   గత శుక్రవారం నుంచి ఈ పెన్‌ షో కొనసాగుతోంది. ఈ మూడు రోజుల పెన్‌ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది.  

అందులోని కొన్ని విడిభాగాలను బంగారంతో తయారుచేయడమే ఆ రేటుకు కారణం. ఇక పెన్ను పెట్టే స్టాండపై సైతం శ్రీరాముడి విగ్రహం, గద, హారం వంటివాటిని ఏర్పాటు చేశారు. ఈ పెన్‌ ప్రదర్శనలో ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, ఢిల్లీ, జైపూర్‌ల నుంచి సుమారు 35 తయారీ సంస్థలు, డీలర్‌లు పాలు పంచుకున్నారు. దేశ, విదేశాలకు చెందిన వందకుపైగా ఉత్తమ బ్రాండ్ల కలాలు ఉన్నాయి. వీటి ధర రూ.600 నుంచి రూ.1.90 లక్షల వరకు ఉంది.