టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ ఎస్ఈకి డాక్టరేట్..అర్బన్ ప్లానింగ్ అండ్ఎన్విరాన్‌మెంట్పాలసీ విభాగంలో పీహెచ్‌డీ

టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ ఎస్ఈకి డాక్టరేట్..అర్బన్ ప్లానింగ్ అండ్ఎన్విరాన్‌మెంట్పాలసీ విభాగంలో  పీహెచ్‌డీ

హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ( తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఎస్ఈ శశిధర్ శనివారం డాక్టరేట్ అందుకున్నారు. టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లోని టెక్సాస్ సదర్న్ విశ్వవిద్యాలయం, బార్బరా జోర్డన్–మికీ లీలాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ నుంచి అర్బన్ ప్లానింగ్ అండ్​ఎన్విరాన్‌మెంట్​పాలసీ విభాగంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. ప్రొఫెసర్ బూమ్ సూక్ చాన్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ జేమ్స్ క్రాఫోర్డ్ శశిధర్ కు డాక్టరేట్​ప్రదానం చేశారు. ఎస్ఈకి కార్పొరేషన్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.