కామారెడ్డి:ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన వెంటనే శిశువు మృతి చెందిన సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో ఆడ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం సింగరాయపల్లికి చెందిన సౌందర్య అనే గర్భిణి ప్రసవం కోసం ఆదివారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఆడ శిశువు జన్మించగా.. పుట్టగానే శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
