జనగామ అర్బన్/ కామేపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా జనగామ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయన ఫొటోకు నివాళులర్పించారు. జనగామ డీసీసీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో దొడ్డి కొమురయ్య ఫొటోకు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొని దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులర్పించారు.
