మహబూబ్‌నగర్/జడ్చర్ల, వెలుగు: పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లిన డెడ్బాడీని కుక్క పీక్కుతిన్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పాత ఏరియా హాస్పిటల్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన పోలే భీమేశ్(33) గత శనివారం బహిర్భూమికి వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.
కాగా సోమవారం ఉదయం భీమేశ్గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు. డెడ్బాడీని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం జడ్చర్ల పాత ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న వార్డ్బాయ్.. డెడ్బాడీని మార్చురీలో ఉంచి గేటుకు తాళం వేసి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతడు తిరిగిరాగా వెనకాల ఓ కుక్క కూడా వచ్చింది. మార్చురీలోని భీమేశ్ డెడ్‌బాడీ వేళ్లను పీక్కుతిన్నది. గమనించిన వార్డు బాయ్కుక్కను తరిమేశాడు. సాయంత్రం భీమేశ్డెడ్బాడీకి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తిచేసి, కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే డెడ్బాడీని కుక్క పీక్కుతింటుండగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్చేయగా వైరల్అయ్యింది.
