మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి అలీ మసీద్ఏరియాలో బుధవారం రాత్రి తొమ్మిదేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. షంషోద్దీన్ కొడుకు ఉమర్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడి కాళ్లు, భుజం, పిక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. మెట్పల్లి హాస్పిటల్లో కుక్కకాటు ఇంజక్షన్లు లేకపోవడంతో ఉమర్ ను జగిత్యాల హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

