కాంగ్రెస్ లో లోకల్ లొల్లి

కాంగ్రెస్ లో లోకల్ లొల్లి
  • కొలిక్కిరాని ZPTC,MPTC అభ్యర్థుల కసరత్తు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లతో కాంగ్రెస్‌ లో లొల్లి మొదలైంది. పీసీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను జిల్లా, మండల నాయకత్వాలకే అప్పగించడంతో అంతర్గత కుమ్ములాటలు గుప్పుమంటున్నాయి. జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో కార్యకర్తల సమావేశాలువేడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యం గా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలున్న ప్రాంతాల్లో ఆధిపత్య పోరు ఈ సమస్యకు కారణమవుతోం దని పలువురు డీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. ఆ నేతలు తమ అనుచరులను ఎంపిక చేయాలంటూ డీసీసీలపై ఒత్తిడి తెస్తున్నారని, ఇదే సమయంలో పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు అనుచరులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నానని అంటున్నారు. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారిం ది.

కొన్ని ప్రాంతాల్లో…

పెద్దపల్లి జిల్లాలో రామగుం డం, మంథని నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం నిర్వహిస్తున్న సమావేశాలు సజావుగానే ముగి శాయని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్య చెబుతున్నారు. అక్కడ అభ్యర్థుల ఎంపిక కొలి క్కి వచ్చిందని అంటున్నారు. అయితే పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెం ట్ పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తమకు తలనొప్పిగా మారిం దని పేర్కొంటున్నారు. ఆ సెగ్మెం ట్ లో పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న విజయరమణారావు అసెంబ్లీ ఎన్నికల ముం దు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. పార్టీ తరఫున ఆయనే పోటీ చేయడంతో.. సెగ్మెం ట్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సెగ్మెం ట్ పరిధిలోని అన్ని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు ఆయన తన అనుచరుల పేర్లే సిఫార్సు చేస్తున్నారని అంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న తమకు కాకుం డా అసెంబ్లీ ఎన్నికల ముందొచ్చిన టీడీపీ కేడర్ కు అవకాశమిస్తే.. తమ పరిస్థితేమిటని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో నూ ఇలాం టి పరిస్థితే ఉందని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి.

నాలుగైదు రోజుల్లో ఎట్లా ?

ఈ నెల 20లోపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి, జాబితాలు పంపిం చాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే డీసీసీ చీఫ్ లను ఆదేశించారు. దీంతో డీసీసీ చీఫ్ లు మల్లగుల్లాలు పడుతున్నారు. తమ పరిధిలోని నేతలందరినీ సంతృప్తి పర్చడంతోపాటు, గెలవగలిగేవారిని ఎంపిక చేయడంపై దృష్టి సారిం చారు. ఇలాం టి పరిస్థితుల్లో కేవలం నాలుగైదు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక ఎలాసాధ్యమవుతుం దని అంటున్నారు. ఈ వ్యవహారం పీసీసీ దృష్టికి వెళ్లింది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం, తమ అనుచరులకు టికెట్లు ఇప్పిం చుకొని పార్టీలో ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకునే నాయకుల తీరుతో పార్టీకి ఇబ్బంది తప్పదంటున్నారు. రాష్ట్ర నాయకత్వం సరైన రీతిలో స్పందించకపోతే.. అధికార టీఆర్ ఎస్ దూకుడుకు చెక్ పెట్టడం కష్టమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.