మొదటిసారి మాస్క్‌తో కనిపించిన డొనాల్డ్‌ ట్రంప్‌

మొదటిసారి మాస్క్‌తో కనిపించిన డొనాల్డ్‌ ట్రంప్‌
  • నల్ల మాస్క్‌తో పబ్లిక్‌ ప్లేస్‌లోకి వచ్చి అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త లుక్‌లో కనిపించారు. మొదటిసారి మాస్క్‌లో దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడిస్తున్నా ట్రంప్‌ ఎప్పుడూ రూల్స్‌ను లెక్కచేయలేదు. అందరూ కచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలని హెచ్చరించినా ట్రంప్‌ మాత్రం ఎప్పుడూ వినిపించుకోలేదు. కాగా.. శనివారం ఉదయం వాషింగ్టన్‌ డీసీలోని మిలటరీ హాస్పిటల్‌ను సందర్శించిన టైంలో ఆయన నలుపు రంగు మాస్క్‌ వేసుకున్నారు. మిలటరీ హాస్పిటల్‌లో పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ట్రంప్‌ తొలిసారి మాస్క్‌తో కనిపించడంతో సోషల్‌ మీడియాలో అది హాట్‌టాపిక్‌ అయింది.