
హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్రైనేజీల్లో మాన్యువల్ స్కావెంజింగ్కు తావు ఇవ్వొద్దని, శానిటేషన్పనులు పూర్తిగా మెకానికల్ పద్ధతుల ద్వారానే జరగాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. అలాగే జీవీపీ, చెత్త సేకరణను డీసీలు, జెడ్సీలు నేరుగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. శానిటేషన్ పనుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. లోపాలు తలెత్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యం, కార్మికుల భద్రత జీహెచ్ఎంసీకి ప్రథమ కర్తవ్యమన్నారు.