హైదరాబాద్: మంచి నీళ్లను మిస్ యూజ్ చేస్తే పెనాల్టీలు వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గత పదేళ్లలో సరిగ్గా తాగు నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ మేం అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లు ఇస్తామని రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. నీళ్లు రావట్లేదని ఉద్దేశపూర్వకంగానే జలమండలి దగ్గర ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని.. విపక్షంలో ఉన్నపుడు మేం కూడా రాజకీయాలు చేశామని.. కానీ నీటి మీద ఏనాడు పాలిటిక్స్ చేయలేదన్నారు.
ఇకనైనా నీటి మీద రాజకీయాలు చేయడం కేటీఆర్ బంద్ చేయాలని సూచించారు. మంగళవారం (మే 26) ఖైరతాబాద్‌లోని జలమండలిలో అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 650 MGD నీళ్ల సప్లై అవుతుందని తెలిపారు. రూ.7 వేల కోట్లతో గోదావరి ఫేజ్2, 3 పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగర భవిష్యత్ నీటిపై ఎలాంటి ప్లాన్ చేయలేదని విమర్శించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2, 3 తీసుకువస్తుందని తెలిపారు. భవిష్యత్ లో కృష్ణా ఫేజ్ 4, 5 తీసుకొస్తామని చెప్పారు. నగరంలో14 లక్షల 50 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయని.. ఇందులో 6 లక్షల 23 వేలు ఉచిత కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన డ్రింకింగ్ వాటర్ సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నామన్నారు. సమ్మర్లో ట్యాంకర్ సప్లై బాగా జరుగుతుందని.. 95 శాతం ట్యాంకర్లు బుకింగ్ అయిన 24 గంటల్లోనే డెలివరీ అవుతుందని చెప్పారు.
ALSO READ : బూత్ స్థాయిలో బలపడితే మళ్లీ కాంగ్రెస్ దే అధికారం
సిటీలో 6 లక్షల 14 వేల మ్యాన్ హోల్స్ ఉన్నాయని.. ఏప్రిల్, మే నెలల్లో మ్యాన్ హోల్స్ మొత్తం క్లియర్ చేస్తున్నామన్నారు. ప్రజలంతా వీలు ఉన్న చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల కోసం ఈసారి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రౌండ్ వాటర్‌ను పెంచకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయని.. వర్షపు నీటిని ఒడిసి పట్టకపోతే కష్టమని హెచ్చరించారు. ఒక ఉద్యమం లాగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని.. ఇందుకు ప్రజలు సహకారం కావాలని కోరారు.
వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసేవారిని ఎంకరేజ్ చేస్తామని.. వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా.. అదే ప్రాంతం నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకుంటామంటే అప్పుడు డబుల్ రేట్ వేస్తామన్నారు. 11 వేల 900 కోట్లు జలమండలి అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల కోసం కేటాయించామని వెల్లడించారు.
జలమండలిలో ఉద్యోగుల ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. డ్రైనేజ్ లైన్స్‌పై అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సామర్థ్యం ఉందా లేదా అని చూడకుండానే భారీ భవనాలు, హై రైజ్డ్ బిల్డింగ్స్‌కి పర్మిషన్లు ఇచ్చారని.. ఇకనుంచి అలాంటి హై రైజ్డ్ బిల్డింగ్స్‌కి పర్మిషన్లు ఇచ్చేముందు అన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
