ఇబ్రహీంపట్నం, వెలుగు: అనవసర లింక్‌లపై క్లిక్ చేయవద్దని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఆశ చూపితే నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. డబ్బులు ఊరికే రావని, లక్కీ డ్రా, తక్కువకు గోల్డ్ అంటే మోసపోవద్దని హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో యువతకు ఆదిబట్ల పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
అమ్మాయిలు ప్రైవేట్ లైప్‌ను సోషల్ మీడియాలో పెట్టవద్దని సూచించారు. జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, సీఐ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
