మారేడ్పల్లి, సిల్వర్ కాంపౌండ్ లో..లబ్ధిదారులకు డబుల్ ఇండ్ల పంపిణీ

మారేడ్పల్లి, సిల్వర్ కాంపౌండ్ లో..లబ్ధిదారులకు డబుల్ ఇండ్ల పంపిణీ
  •     పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మారేడ్​పల్లి, సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం బాలంరాయిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​తో కలిసి లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. సొంత భూములను ప్రభుత్వానికి ఇచ్చి ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్లు అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రాంతంలో స్థలాల కొరతపై ఎమ్మెల్యే శ్రీగణేశ్ మంత్రికి విన్నవించగా.. కేంద్ర ప్రభుత్వం, కంటోన్మెంట్ బోర్డుతో చర్చించి స్థలాలను సమకూర్చి మరిన్ని ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, తహసీల్దార్లు అసదుల్లా ఖాన్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.