‘డబుల్’ ఇండ్లు.. 8 ఏండ్లుగా ముందుకు సాగలే

‘డబుల్’ ఇండ్లు.. 8 ఏండ్లుగా ముందుకు సాగలే
  • ‘డబుల్’ ఇండ్లు.. 8 ఏండ్లుగా ముందుకు సాగలే
  • 2.91 లక్షల ఇండ్లలో పూర్తయినవి 1.13 లక్షలే

హైదరాబాద్, వెలుగు: ఎనిమిదేండ్లుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు ముందుకు సాగడం లేదు. 2.91 లక్షల ఇండ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి దాకా 1.13 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. అసలు నిర్మాణమే మొదలు కానివి 61,606 ఉన్నాయి. ఇంకా కట్టుడు స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 69 వేలు ఉన్నాయి. రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాజాగా ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హౌసింగ్ డిపార్ట్​మెంట్ పేర్కొన్నది. మరోవైపు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందిన ఇండ్లు 20 వేల లోపే. ఇంకా 90 వేల దాకా ఇండ్లు సిద్ధంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఇబ్బంది ఏంటంటూ అర్హులు ప్రశ్నిస్తున్నారు. నీరు, కరెంట్ వంటి సౌలతులు ఏర్పాటు చేయకపోవడం ఒక కారణంగా ఆఫీసర్లు చెబుతున్నారు. కొంతమందికే ఇండ్లు పంపిణీ చేస్తే.. లక్షల సంఖ్యలో అర్హుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. సొంత జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ఈసారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్కార్ నిధులు కేటాయించింది. ఇది మొదలుపెట్టాకే ఇండ్లు పంపిణీ చేయాలని.. ఎన్నికలకు ఎడెమినిది నెలల ముందు చేస్తే రాజకీయంగా కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.

అన్నీ అప్పులే

2015 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ఇండ్ల సంఖ్య 2,91,057గా ఉంది. ఇందులో 2,73,534 ఇండ్లకు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2,29,451 ఇండ్లకు టెండర్లు పిలిచారు. 1.13 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. 61,606 ఇండ్లు పనులు ఇంకా మొదలు కాలేదు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇండ్ల నిర్మాణానికి రూ.10,800 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రూ.8,744 కోట్లు హడ్కో నుంచి అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పుకు కట్టిన వడ్డీ కూడా భారీగా పెరిగింది. ఇప్పటి దాకా కట్టిన వడ్డీ రూ.2,661 కోట్లు ఉన్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ పేర్కొన్నది. రాష్ట్ర సర్కార్ రూ.14,786 కోట్లకు బడ్జెట్ శాంక్షన్స్ ఇచ్చినప్పటికీ.. ఇందులో రూ.2 వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఇవి కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన కింద రాష్ట్రానికి వచ్చిన నిధులేనని తెలుస్తోంది. వాస్తవానికి 2.91 లక్షల ఇండ్లకు రూ.19,126 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ లెక్కన మరో రూ.9 వేల కోట్ల అవసరం ఉన్నాయి. అయితే గ్యారంటీ అప్పుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయి. దీంతో ఈసారి హడ్కో నుంచి అప్పు పుట్టడం కష్టంగా మారింది. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఇండ్లు, అసలే మొదలుపెట్టని వాటి సంగతి ప్రశ్నార్థకంగా మారింది.

భారీగా అర్హులు..

రాష్ట్రంలో సొంతిళ్లు లేని వారి సంఖ్య 30 లక్షలకు పైనే ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 2014 సమగ్ర సర్వే ప్రకారమే ఇండ్లు లేని పేదలు 26.31 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. మంది లబ్ధిదారులు ఉండటం, ఇండ్లు తక్కువగా ఉండటంతో స్థానికంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. దీంతో రేపు మాపు అంటూ పంపిణీ వాయిదా వేస్తున్నరు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటిదాకా సర్కార్ స్పష్టమైన మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, సొంతిల్లు లేకపోవడం వంటి డాక్యుమెంట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నామని చెబుతున్నా రూల్స్ మాత్రం స్పష్టం చేయలేదు. వందల్లో పూర్తయిన డబుల్ ఇండ్లకు ఆయా ప్రాంతాల్లో ఉండే వారి నుంచి వస్తున్న అప్లికేషన్లు వేలల్లో ఉంటున్నాయి. దీంతో పంపిణీకి లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు.