ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీలో కొత్త ఉత్సాహం

ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీలో కొత్త ఉత్సాహం

హైదరాబాద్: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. యూపీలో అవినీతిరహిత సర్కారుకు ప్రజలు ఓటేశారని చెప్పారు. అక్కడి పేదలకు న్యాయం జరిగినందునే బీజేపీకి మరోసారి అవకాశం ఇచ్చారని సంజయ్ అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటించాలని సూచించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాల పర్యటన విహారయాత్రగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. 

యూపీలో 35 ఏళ్ల రాజకీయ చరిత్రను యోగి తిరగరాశారని బండి సంజయ్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయని చెప్పారు. దేశంలో బీజేపీ పని అయిపోయిందన్న వారికి ఇవాళ్టి ఫలితాలే బుద్ధి చెబుతాయని అన్నారు.