- బయో ఏసియా సదస్సులో ప్రదానం చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: కేన్సర్ జీన్థెరపీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్బ్రూస్ లెవిన్‌కు బయో ఏసియా సదస్సు వేదికగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నట్టు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ ట్రీట్మెంట్లో కొత్త అధ్యాయం తీసుకొచ్చారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్టీ సెల్ థెరపీ, జీన్ ఎడిటింగ్వంటి వాటితో కేన్సర్ ట్రీట్మెంట్కు కొత్త బాటలు వేశారన్నారు. ఇమ్యునోథెరపీకి కొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేయడంతో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
