హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి అరుదైన గుర్తింపు లభించింది. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏవోయూ) ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా ఆయన ఎంపికయ్యారు. 2026–2028 కాలానికి గాను చక్రపాణిని ఈ పదవిలో నియమిస్తున్నట్లు ఏఏవోయూ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమ్మత్ బుదిమాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆసియా ఖండంలోని అన్ని ఓపెన్ వర్సిటీలు ఇందులో సభ్యులుగా ఉంటాయి. ఇటీవల చైనాలోని బీజింగ్ లో జరిగిన 2025 సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఏఏవోయూ సభ్యుడిగా ఎంపిక కావడంపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు.
