బెంగళూరు కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్‌ను డీఆర్ఐ ఛేదించింది. అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 6 మరియు 7 తేదీలలో విమానాశ్రయంలోని టెర్మినల్-2లో డీఆర్ఐ బెంగళూరు జోనల్ యూనిట్ ఈ మెరుపు దాడులు నిర్వహించింది. పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, బంగ్లాదేశ్ జాతీయులుగా అనుమానిస్తున్న స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను గుట్టురట్టు చేశారు.
బంగారాన్ని పేస్ట్ రూపంలో క్యాప్సూల్స్ షేప్ ప్యాకెట్లతో శరీరానికి అంటించుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కస్టమ్స్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఈ ముఠా వాష్‌రూమ్‌లు , స్మోకింగ్ జోన్లను ఉపయోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ముఠా పట్టుబడకుండా ఉండేందుకు, కోడెడ్ మేసేజ్ లు, మాయమయ్యే చాట్‌లతో సహా, ఎన్‌క్రిప్ట్ చేయబడిన న్యూస్ వినియోగించుకుంటున్నట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
గోల్డ్ స్మగ్లింగ్ కు ఈ ముఠా అనుసరించిన ట్రిక్స్ చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోయారు. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి, చిన్న చిన్న క్యాప్సూల్ ప్యాకెట్లలో నింపి శరీరానికి అతికించి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కస్టమ్స్ కళ్లు గప్పడానికి ఎయిర్ పోర్టులోని వాష్‌రూమ్‌లు , స్మోకింగ్ జోన్‌లను హ్యాండోవర్ పాయింట్లు గా వాడుకున్నారు.
ముఠా సభ్యులు ఎన్‌క్రిప్ట్ చేసిన యాప్‌లు, డిస్ అప్పియరింగ్ చాట్స్ , రహస్య పాస్‌కోడ్‌లను ఉపయోగించారు. బెంగళూరు మీదుగా ఎక్కువ సమయం ఆగే విమాన మార్గాలను ఎంచుకుని, ఆ సమయంలో ఎయిర్ పోర్టు లోపల ఉండే హ్యాండ్లర్లకు బంగారాన్ని చేరవేస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఎయిర్ పోర్టు సెక్యూరిటీని తప్పించుకునేందుకు సిబ్బందిలో ఒకరు సహకరించారు. నిషేధిత ప్రాంతాల్లోకి తనకు ఉన్న ఆఫీషియల్ ఎంట్రీని ఉద్యోగి వినియోగించుకుని స్మగ్లర్ల నుంచి బంగారాన్ని అందుకుని బయటకు తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం ఒక చిన్న ముఠా పని కాదు, విదేశీ ఏజెంట్లు ,దేశీయ హ్యాండ్లర్లతో కూడిన ఒక పెద్ద సరిహద్దు స్మగ్లింగ్ నెట్‌వర్క్ అని డీఆర్ఐ అధికారులు చెప్పారు.
