సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన డ్రైవర్లు

సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన డ్రైవర్లు

అసంఘటిత రంగంలో పని చేస్తున్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని క్యాబ్, ఆటో యూనియన్​ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇందుకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్​ యూనియన్​ ఆధ్వర్యంలో ఆగస్టు 8న ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. 

ఈ క్రమంలో పెద్ద ఎత్తున డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. డ్రైవర్లు నిరసన చేస్తున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కి తరలించారు. 

శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమని అరెస్ట్ చేయడం ఏంటని క్యాబ్​ యూనియన్​ప్రశ్నించింది. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు,  డ్రైవర్​బ్యాడ్జీ రెన్యూవల్​ పెనాల్టీ ఎత్తివేత, పార్కింగ్​ స్థలాలు కేటాయింపు తదితర డిమాండ్లతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.