V6 News

మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : మేనేజర్(డీఆర్ఎం) గోపాలకృష్ణ

మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : మేనేజర్(డీఆర్ఎం) గోపాలకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సికింద్రాబాద్​ రైల్వే డివిజనల్​ మేనేజర్(డీఆర్ఎం)​ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం మంచిర్యాల, మందమర్రి స్టేషన్లలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి  ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్​లో 100 కేవీ​సోలార్​ పవర్​ ప్లాంట్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వేలో మంచిర్యాల అత్యంత కీలకమైన స్టేషన్  అని తెలిపారు.​ రైల్వే స్టేషన్‌‌‌‌లో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు.​

వినతుల వెల్లువ..

డీఆర్ఎంకు వివిధ పార్టీల లీడర్లు, కార్మిక, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు రైల్వే సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. మందమర్రి స్టేషన్​లో సింగరేణి, రామగిరి ప్యాసింజర్లు, కాగజ్​నగర్​ ఎక్స్​ప్రెస్​కు హాల్టింగ్​ కల్పించాలని, రెండో ప్లాట్​ఫాం మీద టికెట్​ కౌంటర్​ ఏర్పాటు, నార్లాపూర్​ అండర్​బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. మంచిర్యాల స్టేషన్​లో చైన్నై నుంచి భగత్​ కి కోటి వెళ్లే ఎక్స్​ప్రెస్​ రైలుకు హాల్టింగ్, మరిన్ని సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​ కల్పించాలని శ్రీరాందేవ్​ సేవా సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.