ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతు ధర కరువు

 ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతు ధర కరువు
  • జెండా పాట 22 వేలు .. కొనేది 12 వేలు 
     

ఖమ్మం: మిర్చి ధర పడిపోయింది. మొన్నటి వరకు ఆకాశానికి ఎగబాకినట్లు 50వేలకు పైబడి ఎగబాకిన మిర్చి ధర నేల చూపులు చూస్తోంది. భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర తగ్గిపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఖమ్మం మార్కెట్ లో కొనుగోలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 

కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు ఎంతో ఆశతో పంట తీసుకుని వచ్చారు. దాదాపు రెండు వేలకుపైగా మిర్చి బస్తాలు మార్కెట్ కు అమ్మకానికి వచ్చాయి. జెండా పాట 22వేలుగా అధికారులు నిర్ణయించారు. అయితే మార్కెట్లో  ఏసీ మిర్చి ధర కనిష్ట ధర 19వేల రూపాయలు ఉండగా... నాన్ ఏసీ మిర్చి 12 వేల నుంచి 13 వేలకు అమ్ముడుపోతోంది. జెండా పాట చూస్తే కొండంత ఉన్నా... మద్దతు ధర ఇవ్వకుండా 12 వేలకు అడగటం అన్యాయమని వాపోతున్నారు రైతులు.