సైబరాబాద్ & యాంటీ నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడిన మాదకద్రవ్యాలను పోలీసులు ధ్వంసం చేశారు. 7 కోట్ల17 లక్షల 82 వేల విలువైన 2,380 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. TGNAB డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ CP అవినాష్ మొహంతి పర్యవేక్షణలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ లో మాదక ద్రవ్యాలను కాల్చి ధ్వంసం చేశారు పోలీసులు.
