తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 18 మంది.. జరిమాన ఎంతంటే...

 తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 18 మంది.. జరిమాన ఎంతంటే...

అఖిలాండ‌ కోటి‌ బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి సన్నిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మంది పట్టుబడడం కలకలం రేపుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు నిందితులను కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి తిరుమల కోర్టు భారీ జరిమాన విధించడంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

తిరుపతి పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపిన డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు.  18 మందిపై కేసులు నమోదు చేసి తిరుపతి 4వఅడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్  కోర్టు లో  హాజరు పరిచారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 18 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు  చొప్పున మొత్తం లక్షా 80 వేల రూపాయిలను  జరిమానాను కోర్టు విధించడంతో పాటుగా నిందుతులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 

అలాగే రోడ్డుకి ఇరువైపులా.. అనుమతిలేకుండా వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేశారు.  వాహనాల రాకపోకలకు, పాదచారులకు వీరి వ్యాపారాల వలన చాలా ఇబ్బంది కలుగుతుందని పోలీసులు తెలిపారు. ఎలాంటి పర్మిషన్​ లేకుండా రోడ్డుపై వ్యాపారాలు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న 20 మందిపై U/S 285 BNSS ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి వారికి ఒక్కొక్కరి రూ. 500 చొప్పున ..  మొత్తం రూ. 10 వేలు జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు విధించడంతో ... ప్రజలకు ఇబ్బంది కలిగించిన వారికి సీరియస్​ గా వార్నింగ్​ ఇచ్చింది. ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడినా.. ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించినా  భారీ జరిమానాలతో పాటు.. జైలు శిక్ష  విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు

ALSO READ | కాపాడాలంటూ... నేరుగా కోర్టుకే వచ్చిన యువకుడు

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రజలు ఇబ్బంది పడకుండా .. ట్రాఫిక్​ సమస్యను నియంత్రించేందుకు  అందరూ సహకరించాలని  ఎస్పీ  వి. హర్షవర్ధన్ రాజు కోరుతూ.... తిరుపతి ట్రాఫిక్ పోలీసుల పనితీరును అభినందించారు. ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఈ కేసుల వివరాలను  ట్రాఫిక్ డిఎస్పి రమణ కుమార్ మీడియాకు వివరించారు.