
- గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు
- పట్టుబడినోళ్లలో 82% మంది యువకులు
- 2,668 బైక్స్, 431 కార్లు సీజ్
హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల టైమ్లో గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చాలామంది పట్టుబడ్డారు. 3 కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు తనిఖీలు చేసిన పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా మొత్తం 3,173 మందిపై కేసులు నమోదు చేశారు. గతేడాది కంటే 675 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులకు పట్టుబడిన వాళ్లలో 82% మంది యువకులే ఉన్నారు. 60 నుంచి 70 ఏండ్లు ఉన్నోళ్లు 13 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 500 కంటే ఎక్కువ బీఏసీ లెవల్స్ వచ్చినోళ్లు 76 మంది దొరికారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికినోళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి, వెహికల్స్ సీజ్ చేశారు. కాగా, మొత్తం 185కు పైగా టీమ్స్ తో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. పలుచోట్ల పోలీసులతో గొడవలకు దిగినోళ్లకు స్టేషన్లకు తరలించారు.
కేసులు, సీజ్ చేసిన వెహికల్స్ వివరాలు..
కమిషనరేట్ కేసులు బైక్స్ కార్లు ఆటోలు ఇతర వాహనాలు
హైదరాబాద్ 1,413 1,240 132 34 7
సైబరాబాద్ 1,314 1,045 242 21 6
రాచకొండ 446 383 57 6 –
మొత్తం 3,173 2,668 431 61 13