మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. జాతీయ రహదారిపై మద్యం మత్తులో చొక్కా విప్పేసి జై రేవంత్ అంటూ హల్ చల్ చేశాడు. రహదారిపై పడుకొని వాహనాలను అడ్డుకుంటూ రచ్చరచ్చ చేశాడు. మత్తులో ఉన్న వ్యక్తిని ఆపేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా.. లెక్కచేయకుండా రెచ్చిపోయాడు. చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి జై అంబేద్కర్, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశాడు. ఈ ఘటన మేడ్చల్ లో జరిగింది.
మేడ్చల్ పట్టణంలోని ఎన్ హెచ్ 44పై అర్థరాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు బట్టలు విప్పేసి హంగామా చేశాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదంటూ.. మల్లారెడ్డిని బండ బూతులు తిట్టాడు. ఆ వ్యక్తిని ఆపేందుకు పోలీసులు నానా కష్టాలు పడ్డారు. చివరకు యువకుడికి సర్దిచెప్పి అతని బంధువులకు అప్పగించారు.