
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు కేసుతో డీఎస్సీ స్పెషల్ టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పలు జిల్లాల్లో ఆగిపోయింది. తమకు టెట్ అవసరం లేదని కొందరు స్పెషల్ టీచర్ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, స్పెషల్ ఎస్జీటీ కేటగిరీలో 13 జిల్లాలు, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 14 జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగిపోయింది. అయితే, ఇటీవల కోర్టుకు పోయిన కొందరు అభ్యర్థులు అప్పీల్ విత్ డ్రా చేసుకోవడంతో, ఆదివారం ఐదు జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అధికారులు అవకాశం ఇచ్చారు. కాగా, ఈ నెల 2 నుంచి 5 వరకూ డీఎస్సీ 2024 జనరల్ పోస్టులకు 1: 3 చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 25,924 మంది అభ్యర్థులను పిలవగా.. 24,466 మంది అటెండ్ అయినట్టు అధికారులు ప్రకటించారు.