ఇరాన్ డ్రోన్ అటాక్.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ క్లోజ్

ఇరాన్ డ్రోన్ అటాక్.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ క్లోజ్

దుబాయ్ ఎయిర్ పోర్ట్పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్ విమానాశ్రయంలో క్షిపణి దాడి జరిగిందని.. అయితే పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ డ్రోన్ అటాక్ జరిగిన కొన్ని గంటల తర్వాత దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, విమానయాన సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. దుబాయ్పై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేసే ప్రమాదం ఉందనే సమాచారంతో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ దుబాయ్కు రాకపోకలను నిలిపివేసింది.

అబుదాబిలో కూడా భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. అబుదాబిలోని జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొంది.

తమపై దాడులు చేస్తే తప్ప ఇరుగుపొరుగు దేశాలపై ఇరాన్ ఇకపై దాడులు చేయదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించినప్పటికీ గల్ఫ్ దేశాలపై ఇప్పటికీ ఇరాన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో కూడా శనివారం పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

►ALSO READ | అమెరికాకు లొంగేది లేదు.. గల్ఫ్ దేశాలకు సారీ చెబుతూనే.. కండీషన్ పెట్టిన ఇరాన్..!