మా హోటల్‌లో భోజనం ఫ్రీ

మా హోటల్‌లో భోజనం ఫ్రీ

దానాలన్నింటిలోకి అన్నదానాన్ని మించింది మరొకటి మరోకటి లేదంటారు పెద్దలు. దుబాయ్‌లో హోటల్ వ్యాపారాన్ని నడుపుతున్న ఫాదీ అయ్యద్(39) ఇదే మార్గాన్ని అనుసరిస్తూ ఎంతో మంది ఆకలి తీర్చుతున్నారు. దుబాయ్‌లో ఫౌల్ డబ్ల్యూ హమ్మస్ అనే అరబిక్ రెస్టారెంట్ నడుపుతున్నారు ఫాదీ. రెస్టారెంట్ బయట దానిక పేరుతో పాటు ఓ పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఆహారం కొనుక్కోలేనివారికి మా హోటల్‌లో భోజనం ఉచితం అని రాసి ఉంది. ఇది అల్లా ఇస్తున్న బహుమతి అని ఉంది. అంటే ఎవరైనా తినడానికి డబ్బుల్లేక ఆకలితో బాధపడుతుంటే వారికి ఈ హోటల్‌లో భోజనం ఫ్రీ అన్నమాట.

రోజూలో తాము 30 నుంచి 40 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నామని ఫాదీ చెబుతున్నారు. డబ్బుల కోసమే వ్యాపారాన్ని నడుపుతున్నామని.. అయితే తనకు వచ్చే దాంట్లోనే ఎంతో కొంత ఈ విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ హోటల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తో పాటు టీ నుంచి కూల్‌డ్రింక్ వరకు ఉంటాయన్నారు. డబ్బులు లేని వారు వారికి నచ్చిన ఏ ఐటమ్ అయినా ఫ్రీగా తినచ్చని చెప్పారు ఫాదీ అయ్యద్.